బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (14:28 IST)

ప్రభాస్ మరో కజిన్ విరాట్ రాజ్ హీరోగా చిత్రం ప్రారంభం

Virat Raj - ganesh master, sukumar
Virat Raj - ganesh master, sukumar
ప్రభాస్ కుటుంబానికి చెందిన మరో వ్యక్తి హీరోగా పరిచయం కాబోతున్నాడు. 2011 లో కన్నడ సినిమా జోష్ రీమేక్ ద్వారా ప్రభాస్ మొదటి కజిన్ సిద్దార్త్ రాజ్ కుమార్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన మరలా సినిమా చేయలేదు. తాజాగా నేడు బుధవారంనాడు మరో కజిన్ విరాట్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. నేడు రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా పూజ కార్యక్రమాలు జరిగాయి. ఇందుకు సినీప్రములు హాజరయ్యారు.
 
 ఈ చిత్రానికి ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ దర్శకుడిగా మారారు.  గణేష్ మాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, భీంలా నాయక్ ఇప్పుడు హరిహర వీరమల్లు  సినిమాలోని పాటలకి కొరియోగ్రాఫ్ చేశారు. 
 
ఈ సందర్భంగా పూజ వేడుకలో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ హాజరై. కథ విన్నాను. చాలా కొత్తగా అనిపించిందంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు గౌడ్ సాబ్ అనే పేరు ఖరారు చేశారు. మాస్ యాక్షన్ సినిమాగా వుండబోతుంది. దీనిని శ్రీపాద పాద ఫిల్మ్స్ బేనర్ పై ఎస్.ఆర్. కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకటరమణ, సాయికృష్ణకార్తీక్ సంయుక్తంగా నిర్మిస్తు న్నారు. వేంగి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.