బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2024 (16:18 IST)

ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో చిత్రం ప్రారంభం

Hanu, prabhas
Hanu, prabhas
కల్కి 2898 AD తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. సీతా రామం  డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.  ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్  కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ప్రభాస్ కు నిలిచేలా దర్శకుడు కథను సిద్ధం చేసేసాడు. డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా కోసం1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్, పవర్ ఫుల్ వారియర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. 
 
Hanu, prabhas, imanvi and others
Hanu, prabhas, imanvi and others
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ స్టార్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌, హై ప్రొడక్షన్ వాల్యూస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.
 
చిత్రం ఈరోజు హైదరాబాద్ లో  మూవీ టీమ్ సమక్షంలో అత్యంత ఘనంగా ప్రారంభమైయింది. ప్రభాస్, ఇమాన్వి హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.  
 
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిమ్రిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సుదీప్ ఛటర్జీ ఐఎస్‌సి డీవోపీ కాగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. రామకృష్ణ - మోనికా ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరిన్ని వివరాలు తెలియనున్నాయి.