బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (22:26 IST)

ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుంది.. వచ్చే దసరా నాటికి..?: శ్యామలాదేవి

Prabhas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం ఆ ప్రశ్నకు ప్రభాస్ పెద్దమ్మ సమాధానం ఇచ్చారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. 
 
దసరా నవరాత్రుల్లో విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణంరాజుగారు తమతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ తమ ఫ్యామిలీ ముందుకు వెళ్తోందన్నారామె. 
 
ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని తను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని శ్యామలాదేవి చెప్పారు. అయితే అమ్మాయి ఎవరనేది మాత్రం ఆమె చెప్పలేదు. వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడిగా ఉంటాడని శ్యామలాదేవి చెప్పారు. ఈ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు బూస్ట్‌నిస్తున్నాయి.