శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (13:49 IST)

'రాధేశ్యామ్'పై లాక్ డౌన్ ప్రభావం పడనుందా!?

'రాధేశ్యామ్'పై లాక్ డౌన్ ప్రభావం పడనుందా!? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ముంబై-మహారాష్ట్రను ఊపేస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. ప్రత్యేకించి చిత్ర పరిశ్రమపై బాగా ఉంటోంది.
 
ప్రస్తుతం ముంబైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న 'రాధేశ్యామ్'పై కూడా ఈ ఎఫెక్ట్ పడిందట. వీఎఫ్ ఎక్స్ వర్క్ పై ప్రభావం పడటంతో ఆ పనిని ముంబై నుంచి హైదరాబాద్ కి మార్చబోతున్నారట. ఇదే నిజం అయితే రిలీజ్ డేట్ కూడా మారవచ్చంటున్నారు.
 
'సాహో' తర్వాత ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. దాంతో చిత్రబృందం ఏదోలా కష్టపడి అనుకున్న టైమ్ కే పూర్తి చేసి విడుదల చేస్తారని భావిస్తున్నారు.