శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 27 జులై 2021 (11:49 IST)

ఫిలిం క్రిటిక్స్ నూత‌న అధ్య‌క్షుడిగా ప్ర‌భు

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కొత్త అధ్య‌క్షుడిగా ఫిలిం జ‌ర్న‌లిస్టు ప్ర‌భు ఏక‌గ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కొత్త కార్య‌వ‌ర్గం ఎన్నిక‌లు హైద‌రాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో జ‌రిగాయి.

ఈ ఎన్నిక‌ల్లో జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భును అధ్య‌క్షుడిగా, మిగ‌తా కార్య‌వ‌ర్గాన్ని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే కోశాధికారి ప‌ద‌వి కోసం హేమ‌సుంద‌ర్, నాగభూష‌ణం పోటీ ప‌డ్డారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ల‌క్ష్మ‌ణ‌రావు రిట‌ర్నింగ్ అధికారిగా జ‌రిగిన ఎన్నిక‌లో కోశాధికారిగా హేమ‌సుంద‌ర్ విజ‌యం సాధించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కొత్త అధ్య‌క్షుడు ప్ర‌భు మాట్లాడుతూ, గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యంలో మంచి కార్య‌క్ర‌మాలు చేసిన ప్రెసిడెంట్ సురేష్ కొండేటి, సెక్ర‌ట‌రీ జ‌నార్ధ‌న్ రెడ్డిని అభినందించారు.

కొత్త కార్య‌వ‌ర్గం జ‌ర్న‌లిస్టుల ఆరోగ్య భీమా, ప్ర‌భుత్వ డ‌బుల్ బెడ్రూం ఇళ్ళ మంజూరు త‌దిత‌ర స‌మ‌స్యల‌పై ప‌నిచేస్తామ‌న్నారు. ఫిలిం క్రిటిక్స్ అసో్సియేష‌న్ ఏర్ప‌డి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా గోల్డెన్ జూబ్లి ఉత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ర్వ‌త‌నేని రాంబాబు మాట్లాడుతూ, కొత్త కార్య‌వ‌ర్గానికి అంద‌రి  స‌భ్యుల స‌హ‌కారాన్ని కోరారు.