ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (15:43 IST)

మా మెంబర్స్‌తో ప్రకాష్ రాజ్ లంచ్ మీటింగ్

తెలుగు చిత్రపరిశ్రమలో నటీనటులకు చెందిన అసోసియేషన్ 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్). దీనికి నిర్వహించాల్సిన ఎన్నికలపై పెద్ద రచ్చేజరుగుతుంది.
 
ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ “మా” సభ్యుల కోసం స్పెషల్‌గా ఒక విందు ఏర్పాటు చేశాడు. మన సిని 'మా' బిడ్డలు అంతా కలిసి ఇంటరాక్ట్ అవుదామని, మన విజన్ ఏంటో షేర్ చేసుకుని, అన్ని విషయాలూ చర్చించుకుందాం' అని ప్రకాష్ రాజ్ తన ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.
 
అంతేకాదు సభ్యుల కోసం ఆదివారం ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశాడు. సెప్టెంబర్ 12 ఆదివారం రోజున జెఆర్సి కన్వెన్షన్ సెంటర్‌‌‍‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ మీటింగ్ ఉంటుందని ఆహ్వాన పత్రిక ద్వారా ప్రకాష్ రాజ్ తెలిపారు. దీంతో ఈ మీటింగ్‌లో అసలు ఏం చర్చ జరుగుతుందోనని ఆసక్తి నెలకొంది. 
 
కాగా, 'మా' అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌ను ప్రకటించారు. అయితే ఆయన ప్యానల్‌లో అంతకు ముందు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మరో ఇద్దరు మహిళలు జీవిత రాజశేఖర్, హేమ కూడా ఉండటం అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ బయటకు రావడం, స్వతంత్రంగా పోటీ చేస్తానని చెప్పడం, జీవిత రాజశేఖర్ పై ఆయన కామెంట్ చేయడం మరో వివాదానికి తెర తీసింది.