1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 22 జూన్ 2024 (18:31 IST)

ప్రణయగోదారి పాటల్లోని లిరిక్స్, బీట్, బాగున్నాయి : కోటి

Pranayagodari with  Koti
Pranayagodari with Koti
పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రణయగోదారి  సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్, ప్రియాంక ప్రసాద్, సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 
 
పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న యూనిట్.. జోరుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో నుంచి ఫీల్ గుడ్ సాంగ్ లాంచ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేశారు. కలలో కలలో.. అంటూ సాగిపోతున్న ఈ ప్రేమ గీతంలో లవ్ బీట్ అదిరిపోయిందని చెప్పుకోవాలి. ఇక గోదావరి అందాలు, నాచురల్ లొకేషన్స్ లో షూట్ చేసిన సీన్స్ ఫ్రెష్ ఫీలింగ్ తెప్పిస్తున్నాయి. హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్‌తో పాటు సైడ్ డాన్సర్స్ లుక్స్ కూడా ఈ పాటలో ఆకర్షణీయంగా మారాయి.  
 
 *ఈ సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ..* ప్రణయగోదారి నుంచి ఈ సాంగ్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోందని, అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చేలా ఈ సాంగ్ షూట్ చేశారని అన్నారు. పాటలోని లిరిక్స్, బీట్, అందుకు తగ్గ సన్నివేశాలు, నటీనటుల వేషధారణ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయని అన్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
ఇప్పటివరకు ప్రణయగోదారి మూవీ నుంచి వదిలిన పోస్టర్స్, ఈ సాంగ్ చూస్తుంటే టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరించారని తెలుస్తోంది. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు వెండితెరపై చూపించడమే గాక.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనుభూతిని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారని స్పష్టమవుతోంది. యువతను ఆకర్షించే ఎన్నో పాయింట్స్ కలగలిపి రాబోతున్న ఈ సినిమాకు మార్కండేయ సంగీతం అందిస్తున్నారు. ఈదర ప్రసాద్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చీఫ్ కో డైరెక్టర్ గా జగదీశ్ పిల్లి, డిజైనర్ గా TSS కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ గా గంట శ్రీనివాస్ వర్క్ చేస్తున్నారు.  కొరియోగ్రఫీ: కళాధర్ , మోహనకృష్ణ , రజిని, ఎడిటర్: కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్: విజయకృష్ణ అందిస్తున్నారు.