గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Mohan
Last Modified: మంగళవారం, 9 జనవరి 2018 (17:52 IST)

ఈ సినిమా తన 'మనసుకు నచ్చింద'ని అంటున్న మహేష్‌ బాబు(వీడియో)

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వేసవికి రిలీజ్ కానుంది. గతేడాది వచ్చిన స్పైడర్ చిత్ర ఫలితంతో కాస్త నిరాశ చెందినప్పటికీ, ఈ చిత్రంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నటిస్తున్నారు. కాగా త

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వేసవికి రిలీజ్ కానుంది. గతేడాది వచ్చిన స్పైడర్ చిత్ర ఫలితంతో కాస్త నిరాశ చెందినప్పటికీ, ఈ చిత్రంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నటిస్తున్నారు. కాగా తన అక్క ఘట్టమనేని మంజుల చాలా రోజుల తర్వాత మనసుకు నచ్చింది అనే సినిమాకి దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిథా చౌదరి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసారు. తాజాగా సినిమా ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ మనసుకు ఎంతో హత్తుకునేలా ఉందని మహేష్ బాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. అంతేకాకుండా తన సోదరి మంజులకు మరియు చిత్ర బృందానికి తన శుభాకాంక్షలను తెలియజేసాడు. 
 
ఈ చిత్రం హిట్టయి తన సోదరికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మంజుల కుమార్తె జాన్వీ కూడా వెండితెరకు పరిచయం అవుతోంది. తాజాగా విడుదలైన మనసుకు నచ్చింది సినిమా టీజర్‌ని మీరు ఒకసారి చూసేయండి మరి.