ఆ ఫోటో పంపితే నా న్యూడ్ ఫోటో షేర్ చేస్తానంటూ అభిమానితో ప్రియమణి
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
సోషల్ మీడియాలో పలువురు తారలు చాలా యాక్టివ్ గా వుంటుంటారు. అలాంటివారిలో ప్రియమణి కూడా ఒకరు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రియమణి వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో నల్లటి దుస్తులు ధరించిన ఫోటోలు షేర్ చేశారు. వీటిని చూసిన ఓ అభిమాని అడిగిన రిక్వెస్టుకి ప్రియమణి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.
ఇంతకీ అభిమాని ఏమని అడిగాడంటే... ప్రియమణి నగ్న ఫోటో కావాలంటూ రిక్వెస్ట్ చేశాడు. దాంతో ప్రియమణి... నాకంటే ముందు మీ సోదరిని లేదా మీ తల్లిది గానీ అలాంటి ఫోటో అడిగి షేర్ చేయండి, అప్పుడు నేను కూడా షేర్ చేస్తానంటూ రిప్లై ఇచ్చింది. దీనితో సదరు అభిమాని షేమ్ ఫీలై ఆమెకి క్షమాపణలు చెప్పాడు. కాగా ప్రియమణి ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.