ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (12:23 IST)

నిక్‌తో రష్యాలో షికార్లు.. ముంబైలో ప్రియాంక చోప్రాకు నోటీసులు.. ఎందుకు?

ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో బ్రెజిల్ ఆకట్టుకుంది. లీగ్‌దశలో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. కీలకమైన నాకౌట్ పోరులో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది బ్రెజిల్ జట్టు. అసలు బ్రెజిల్ గురించి ఇక్కడెందుకు ప్రస్త

ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో బ్రెజిల్ ఆకట్టుకుంది. లీగ్‌దశలో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. కీలకమైన నాకౌట్ పోరులో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది బ్రెజిల్ జట్టు. అసలు బ్రెజిల్ గురించి ఇక్కడెందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే..? బ్రెజిల్ మ్యాచ్‌ను తన ప్రియుడితో కలిసి బాలీవుడ్ అందాల రాశి ప్రియాంక చోప్రా తిలకించింది.


నిక్ జోనస్‌తో ఇటీవల ముంబై వచ్చిన ప్రియాంక చోప్రా.. ఆపై అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి ఫిఫా మ్యాచ్‌లు చూసేందుకు ప్రియాంక ప్రియుడితో కలిసి వెళ్లింది. 
 
అయితే గ్లోబల్ ఐకాన్ ప్రియాంకచోప్రాకి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అంథేరిలో ఒషివారా వద్దనున్న ఓ బిజినెస్ కాంప్లెక్స్‌ నిర్మాణం జరిగింది. ఇందులో ప్రియాంకచోప్రాతోపాటు చాలామంది ప్రముఖులకు చెందిన ప్లాట్స్, షాపులన్నాయి.

వీళ్లంతా అక్రమంగా ఈ భవనాన్ని కట్టించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఐదుగురు వ్యక్తులు కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. 
 
వాస్తు కోసం అక్రమ నిర్మాణాలు చేశారని తేలడంతో ప్రియాంకచోప్రాతో పాటు కొంతమందికి నోటీసులు జారీచేశారు. తాము ఇచ్చిన నోటీసుకు స్పందించకపోతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు మున్సిపల్ అధికారులు. మరి ప్రియుడితో కలిసి షికార్లు చేస్తున్న ప్రియాంక చోప్రా ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.