శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (10:36 IST)

ఎన్టీఆర్ బయోపిక్‌.. బాలకృష్ణ, క్రిష్‌లకు నోటీసులు.. ఎందుకంటే?

ఎన్టీఆర్ బయోపిక్‌పై నాదెండ్ల భాస్కరరావు ఫ్యామిలీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో తన తండ్రి భాస్కరరావు పాత్ర విషయమై తమ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని దర్శకుడు క్రిష్, హీరో బాలకృ

ఎన్టీఆర్ బయోపిక్‌పై నాదెండ్ల భాస్కరరావు ఫ్యామిలీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో తన తండ్రి భాస్కరరావు పాత్ర విషయమై తమ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణకు భాస్కరరావు పెద్దకుమారుడు నోటీసులు పంపారు.


ఎమ్మెల్యే, నటుడి హోదాలో బాలకృష్ణకు రెండు నోటీసులు పంపినట్టు సమాచారం. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని.. ఆయనపై బయోపిక్ తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదు కానీ.. తన తండ్రిని నెగటివ్‌గా చూపించాలనుకోవడం సరికాదని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోంది.
 
ఇకపోతే.. ఎన్టీఆర్ బయోపిక్ జూలై 5వ తేదీ నుంచి హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, స్వర్గీయ రామారావు సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తారని సినీ యూనిట్ తెలిపింది.

ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రను పోషించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషించనున్నట్లు సినీ యూనిట్ తెలిపింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూడా తన తండ్రి పాత్రలో, నాగచైతన్య తన తాత అక్కినేని పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.