శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (14:31 IST)

''భరత్'' కోసం ప్రియాంక చోప్రా అంత మొత్తం అడిగిందట.. ఎంత?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా సినిమా ''భరత్'' కోసం ప్రియాంక చోప్రా భారీ పారితోషికం తీసుకున్నట్లు బిటౌన్‌లో ప్రచారం సాగుతోంది. ''భరత్''లో నటించాలంటే.. రూ.145 కోట్ల పారితోషికం కావాలని ప్రియాంక

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా సినిమా ''భరత్'' కోసం ప్రియాంక చోప్రా భారీ పారితోషికం తీసుకున్నట్లు బిటౌన్‌లో ప్రచారం సాగుతోంది. ''భరత్''లో నటించాలంటే.. రూ.145 కోట్ల పారితోషికం కావాలని ప్రియాంక చోప్రా డిమాండ్ చేసిందట. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు జంప్ అయిన ప్రియాంక చోప్రా.. తిరిగి బాలీవుడ్ సినిమాలో నటించాలంటే భారీ పారితోషికం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిందట. 
 
అయితే ''పద్మావత్'' సినిమాలో దీపికా పదుకునేకు రూ.12 కోట్లు పారితోషికం ఇచ్చారని, అదే మొత్తాన్ని మాత్రమే ఇవ్వగలమని నిర్మాతలు బేరానికి రావడంతో ప్రియాంక అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి. 
 
దక్షిణకొరియా చిత్రం 'ఓడ్ టు మై ఫాదర్' ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. అన్నీ పనులు ముగించుకుని.. 2019 రంజాన్‌కు భరత్‌ను విడుదల చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం క్వాంటికో షూటింగ్‌ తర్వాత భరత్ షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం.