ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:12 IST)

ప్రభాస్ మైనపు విగ్రహం పై నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

Prabhas wax statue,  Shobhu Yarlagadda
Prabhas wax statue, Shobhu Yarlagadda
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు బాహుబలి సినిమా ఎంతటి క్రేట్‌ తెచ్చిపెట్టిందో తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్కామీడియాపై శోభు యార్లగడ్డ నిర్మించారు. ఈ సినిమాకు పలు అవార్డులు కూడా దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన ఈ సినిమాపై ఇప్పుడు నిర్మాత ఫైర్‌ అవుతున్నారు. కారణం ఏమంటే...
 
ఫ్రఖ్యాత మాడమే తుస్సాద్‌లో ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని పెట్టడం అరుదైన విషయం. కానీ ఇప్పుడు మైసూర్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో ప్రభాస్ విగ్రహం అభిమానులు పెట్టారు. ప్రభాస్‌ మైనపు బొమ్మను తయారుచేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా దీనిపై నిర్మాత ఫైర్‌ అయ్యారు. అసలు ఇలా చేయడానికి వారికి ఎవరు పర్మిషన్‌ ఇచ్చారు. ఇది అధికారికంగా లైసెన్స్ పొందిన పని కాదు. మా అనుమతి లేదా తెలియకుండా జరిగింది. దీన్ని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం. అని పోస్ట్ చేశారు. మరి ఫాన్స్ ఏమంటారో చూడాలి.