గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (14:38 IST)

నటుడు రాజా శ్రీధర్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్న ప్రభాస్

Rajasridar team with prahas
Rajasridar team with prahas
తెలుగు సినిమాలు, సీరియల్స్ ద్వారా మనందరికీ పరిచయాస్తుడైన నటుడు రాజా శ్రీధర్.  ఆయన శ్రీధర్ ప్రాపర్టీస్ అనే సంస్థ ద్వారా రియల్ ఎస్టేట్ రంగం లోకి ఎంటర్ అయ్యారు. తన ప్రాణ మిత్రుడు అయిన పాన్ ఇండియా సూపర్ స్టార్ శ్రీ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ రోజు శ్రీధర్ ప్రాపర్టీస్ బ్రోచర్ అండ్ వెబ్సైటు లాంచ్ చేయడం ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.  
 
Rajasridar team with prahas
Rajasridar team with prahas
ఈ సందర్బంగా ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్న ప్రభాస్ మంచి పేరు వచ్చేలా ఈ రంగంలో నిలవాలని ఆశీస్సులు అందించారు. అంతరం శ్రీధర్ మాట్లాడాతూ తనకి అత్యంత ఆప్తుడే కాదు,  ఇండియాస్ మోస్ట్ ఫేవరేట్ హీరో అయిన ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం తన అదృష్టం అని ఈ సందర్బంగా ఆయనికి ధన్యవాదములు తెలుపుతూ,  శ్రీధర్ ప్రాపర్టీస్ ద్వారా  రియల్ ఎస్టేట్ సంస్థలకు వీడియో మార్కెటింగ్ సర్వీసెస్లను అందించిడమే కాకుండా అన్నీ రకాల ప్రాపర్టీస్ నూ అన్నీ వర్గాల వారికీ అందించేందుకు కృషి చేస్తామని సంస్థ  కార్యకలాపాలు,  వివరాలు కోసం శ్రీధర్ ప్రాపర్టీస్ డాట్ ఇన్ వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.