శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (11:40 IST)

గద్దర్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ - ప్రియాంక

rahul
ఇటీవల కన్నుమూసిన ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేతల రాహుల్, ప్రియాంకా గాంధీలు పరామర్శించారు. హైదరాబాద్ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో వారిని కలుసుకుని పరామర్శించారు. గద్దర్ తనకు ఎంతో ప్రియమైనవారని తల్లికి, సోదరికి రాహుల్ చెప్పారు. గద్దర్ పోరాట స్ఫూర్తిని సోనియా గాంధీ ఈ సందర్భంగా కొనియాడారు. 
 
తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆదివారం ఈ పరామర్శ జరిగింది. హోటల్‌లో గద్దర్ భార్య విమల, కుమార్తె వెన్నెల, కుమారుడు సూర్యం, ఆయన భార్యను, నేతలను పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని తన తల్లికి చెప్పి... గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు.
rahul - priyanka
 
నిజానికి గద్దర్ ఇంటికే సోనియా, రాహుల్, ప్రియాంకా వెళ్లి కలవాల్సివుంది. కానీ, ఆరోగ్య కారణాల రీత్యా గద్దర్ కుటుంబ సభ్యులను హోటల్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా స్పందిస్తూ, ప్రజల హక్కుల కోసం గద్దర్ పోరాడారని కొనియాడారు.