శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (09:35 IST)

ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు పోసాని కృష్ణమురళి క్ష‌మాప‌ణ‌లు

Posani family
త‌న‌కు అవ‌కాశాలు ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు పోనాసి కృష్ణమురళి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నారు. విష‌యం ఏమంటే, ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా భారినపడ్డారు. తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా పోసాని.వెల్లడించారు. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని  కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులతో దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్ లకు హాజరవుతానని పోసాని కృష్ణమురళి ఒక ప్రకటనలో తెలిపారు. ర‌చ‌యిత నుంచి న‌టుడిగా మారాక పోసాని చాలా బిజీ అయ్యారు. ప్ర‌ముఖ హీరోలు, ద‌ర్శ‌కుల చిత్రాల్లో ఆయ‌న కంప‌ల్‌స‌రి వుంటుంటున్నారు.