శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (22:22 IST)

ఎన్టీఆర్ చనిపోతే లక్ష్మీపార్వతీ చక్కగా టీ తాగింది..

ప్రముఖ నటీమణులలో ఒకరైన పూజిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ భార్య పాత్రలో తాను నటించానని నిజంగా ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో తాను ఆయన ఇంటికి వెళ్లానని పూజిత పేర్కొంది. 
 
ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో లక్ష్మీ పార్వతి గారు చక్కగా కూర్చుని టీ తాగారని పీవీ నరసింహారావు గారు వచ్చిన వెంటనే శవంపై పడిపోయి ఏడ్చారని పూజిత తెలిపింది. 
 
అదే సీన్ తాను చేయడంతో కేసు పెడుతున్నామని, బాంబులతో లేపేస్తామని బెదిరించారని పూజిత వెల్లడించింది. ఆ తర్వాత లక్ష్మీపార్వతి తనతో సరిగ్గా మాట్లాడలేదని పూజిత వెల్లడించింది. 
 
తనకు రావాల్సిన పారితోషికం చాలానే ఉందని పూజిత చెప్పింది. ఒక నిర్మాత తనకు రావాల్సిన పారితోషికం అడిగితే కష్టాల్లో ఉన్నానని ఎప్పుడూ చెబుతాడని పూజిత తెలిపింది. అయితే ఆ నిర్మాత జ్యువెలరీ షాప్ లో లేదా బ్యాంక్‌లో ఎక్కువగా కనిపిస్తాడని తెలిపింది.