శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (11:10 IST)

పునర్నవి భూపాలం.. ఇంట్లోనే వర్కౌట్స్.. వీడియో వైరల్

సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొని ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది పునర్నవి. ఇంకా బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లగింజ్‌తో పునర్నవి ప్రేమాయణం కొనసాగుతుందని టాక్ వచ్చింది. వీరిద్దరి కెమిస్ట్రీ చూసి నిజంగానే ప్రేమలో ఉన్నారేమో, పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారు. 
 
కానీ అది షోలో భాగంగా జరిగిన డ్రామానే కానీ నిజంగా తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు పునర్నవి ‘ఒక చిన్న విరామం’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు బంద్ అయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3 పోటీదారు పునర్నవి భూపాలం ఆమె చేసిన వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినందున ఆమె ఇంట్లో వ్యాయామం చేస్తూ గడుపుతోంది. 
 
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా పునర్నవి ఉయ్యాలా జంపాలా సినిమా ద్వారా గుర్తింపు సంపాదించింది. ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహించారు. రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. పునర్నవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అవికా గోర్ స్నేహితురాలి పాత్రలో నటించింది.