గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 31 మార్చి 2020 (21:15 IST)

అబ్బా... జలుబు, గొంతు నొప్పి, తగ్గేందుకు చిట్కాలు

సాధారణంగా సీజన్ మారినప్పుడల్లా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి బాధపడేవారు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు లేదా వంట సోడాను గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసి క‌లియ‌బెట్టాలి. ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే ఉప్పు యాంటిసెప్టిక్‌గా పనిచేసి గొంతును శుభ్రం చేసి నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీపి ఉన్నవాళ్లు మాత్రం ఈ పని చేయరాదు. 
 
వేడి నీటిలో కాస్త తేనె వేసి తీసుకుంటే గొంతునొప్పి నుంచి త్వర‌గా ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజూ తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి. 
 
దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. 
 
మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తినటం లేదా పాలల్లో మిరియాలపొడి కలిపి తాగినా గొంతు సమస్యలు తగ్గుతాయి. 
 
గొంతులో మంటగా ఉంటే వెల్లుల్లి రెబ్బను తింటే గొంతులో మంట తగ్గుతుంది. 
 
గొంతులో గరగర వంటి సమస్యలు పోవాలంటే ఉల్లిపాయ రసం సేవించడం లేదా అల్లంతో చేసిన టీ గాని, అల్లాన్ని నీటిలో ఉడికించి ఆ నీటిని గాని సేవిస్తే గొంతు సమస్యలకు అడ్డుకోవచ్చు.