ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (08:36 IST)

చివరిదశలో దశలో షూటింగ్, శరవేగంగా పోస్టుప్రొడక్షన్ లో పుష్ప-2

pupshp rule
pupshp rule
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తకిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2' ది రూల్‌.. ఇక డిసెంబరు 6న థియేటర్స్‌లో ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది. మరో 100 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్‌ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది. ఇక రికార్డులు లెక్కపెట్టుకోవడమే.. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన  ఇమేజ్‌తో.. ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ 'పుష్ప-2'లో  అద్వితీయమైన నటన కోసం, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌..మేకింగ్‌.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 
 
ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్‌ అందించిన అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప-2 ది రూల్‌ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. కంటెంట్‌ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. మీరు ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేసిన అంతకు మించి తగ్గేదేలేలా పుష్ప-2 వుండబోతుందని హింట్‌ ఇస్తున్నారు మేకర్స్‌... ఇక డిసెంబరు 6న అందరూ డబుల్‌ మార్క్‌ చేసుకొని రెడీ వుండడి..!
 
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ