ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2024 (12:58 IST)

PUSHPA 2 Hits Fastest 1000 Cr: రూ.1000 కోట్ల క్లబ్ దిశగా పుష్పరాజ్

pushpa-2 movie
PUSHPA 2 Hits Fastest 1000 Cr అల్లు అర్జున్ హీరో నటించి, సుకుమార్ దర్శకత్వం వహించిన తాజాగా చిత్రం "పుష్ప-2". ఈ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆరు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని వెర్షన్‌లలోనూ భారీ వసూళ్లు రాబడుతుంది. ఫలితంగా రూ.1000 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లోకి చేరే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.922 కోట్లు వసూలు చేసినట్టు మేకర్స్ మంగళవారం ఓ పోస్టరు ద్వారా అధికారికంగా ప్రకటించారు. 
 
ముఖ్యంగా, ఉత్తారాది రాష్ట్రాల్లో పుష్పరాజ్ భారీ వసూళ్లను రాబడుతున్నాడు. ఒరిజినల్ తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌లోనే అత్యధిక కలెక్షన్లు వస్తున్నాయని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టబోతున్నట్టు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విడుదలైన వారం రోజుల్లోనే ఈ మైలురాయిని సాధించిన తొలి భారతీయ సినిమాగా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించడం ఖాయం.
 
కాగా, మూవీ కలెక్షన్ ట్రాకింగ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ గణాంకాల మేరకు పుష్ప-2 మంగళవారం రూ.52.50 కోట్లు వసూలు చేసింది. హిందీలో రూ.38 కోట్లు, తెలుగులో రూ.11 కోట్లు, తమిళంలో రూ.2.60 కోట్ల మేరకు రాబట్టింది. బుధవారం కూడా ఇదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం ఖాయంగా తెలుస్తుంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.900 కోట్లు కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా పుష్ప-2 నిలిచిన విషయం తెల్సిందే.