బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (12:48 IST)

బాహుబలి 2లో తప్పులే తప్పులు.. 450 తప్పులు కనిపెట్టారు (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొంది.. బంపర్ హిట్ అయిన బాహుబలి 2లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 450 తప్పుల్ని కనిపెడుతూ ఓ వీడియో విడుదలైంది. ఇంచుమించు ఈ సినిమాలో సిల్లీగా చాలా తప్పులున్నాయని 'బాలీవుడ

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొంది.. బంపర్ హిట్ అయిన బాహుబలి 2లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 450 తప్పుల్ని కనిపెడుతూ ఓ వీడియో విడుదలైంది. ఇంచుమించు ఈ సినిమాలో సిల్లీగా చాలా తప్పులున్నాయని 'బాలీవుడ్‌ సిన్స్' అనే ఓ యూట్యూబ్ ఛాన‌ల్ పేర్కొంది. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా సదరు యూట్యూబ్ ఛానల్ అప్‌లోడ్ చేసింది. 
 
తలమీద అగ్నికుండాన్ని మోస్తూ వచ్చిన శివగామికి చెమటపట్టకపోవడం.. జూనియ‌ర్ ఆర్టిస్టుల ఓవ‌ర్‌యాక్ష‌న్‌ వంటివి అనేకంగా ఈ వీడియోలో చూపించారు. అయితే ఇందులో కొన్ని చోట్ల ఇష్టం వచ్చినట్టుగా తప్పుల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. అయినప్పటికీ కొన్ని త‌ప్పులు మాత్రం న‌మ్మ‌శ‌క్యంగానే ఉన్నాయి.
 
ఇప్ప‌టి వ‌రకు దాదాపు 28 సినిమాల్లోని త‌ప్పుల‌ను ఈ యూట్యూబ్ ఛానల్ చూపెట్టింది. ఇందులో దంగ‌ల్‌, దిల్‌వాలే, పీకే వంటి సినిమాలున్నాయి. 'బాహుబ‌లి' మొద‌టి చిత్రంలో కూడా వీరు 145 త‌ప్పుల‌ను క‌నిపెట్టారు. వీరి వీడియోల‌ు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా బాహుబలి2లోని తప్పులను ఎత్తిచూపే వీడియో వైరల్ అవుతోంది. ఈ  వీడియోను మీరూ వీక్షించండి.