శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Mohan
Last Modified: సోమవారం, 23 అక్టోబరు 2017 (18:32 IST)

మరో ఘనత సాధించిన బాహుబలి 2

బాహుబలి సృష్టించిన సునామీకి భారతీయ చలనచిత్ర గత రికార్డులన్నీ అటకెక్కాయి. రాజమౌళి తన ప్రతిభతో తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించి పెట్టారు. భాషతో సంబంధం లేకుండా సినిమాకు అంత పేరు రావడానికి నటీనటుల నటన, కథ, కథనం, మాటలు, యాక్షన్ ఇ

బాహుబలి సృష్టించిన సునామీకి భారతీయ చలనచిత్ర గత రికార్డులన్నీ అటకెక్కాయి. రాజమౌళి తన ప్రతిభతో తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించి పెట్టారు. భాషతో సంబంధం లేకుండా సినిమాకు అంత పేరు రావడానికి నటీనటుల నటన, కథ, కథనం, మాటలు, యాక్షన్ ఇలా 24 ఫ్రేమ్‌లలోని వారు తమ ప్రదర్శనతో ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టారు. 
 
ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలనచిత్ర వసూళ్ల విషయంలో ద్వితీయ స్థానంలో ఉన్న ఈ సినిమా, ఇప్పుడు మరొక ఘనతను సాధించింది. ఇప్పటివరకూ టెలివిజన్ చరిత్రలో తెలుగులో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక TRP రేటింగ్ సంపాదించింది. ఈ నెల 8న "స్టార్ మా"లో ప్రసారమైన ఈ సినిమా 22.7 TRP రేటింగ్‌తో అదరగొట్టేసింది. దీనితో పాత టెలివిజన్ TRP రికార్డులు కనిపించకుండా పోయాయి. ఇలా తన ప్రదర్శనతో మరొకసారి వార్తల్లో నిలిచింది మన దర్శకధీరుని "బాహుబలి-2".