శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 14 అక్టోబరు 2017 (20:45 IST)

అమరావతి కోసం లండన్‌లో రాజమౌళి... సూచనలు

అమరావతి రాజధాని భవన నిర్మాణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శక ధీరుడు రాజమౌళి సూచనలు, సలహాలు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అమరావతి రాజధాని నగరం డిజైన్లు రూపొందిస్తున్న నార్మన్ పోస్టర్ సంస్థ ఇప్పటికే రెడీ చేసిన డిజైన్లు చూసేందుకు రాజమౌళి

అమరావతి రాజధాని భవన నిర్మాణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శక ధీరుడు రాజమౌళి సూచనలు, సలహాలు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అమరావతి రాజధాని నగరం డిజైన్లు రూపొందిస్తున్న నార్మన్ పోస్టర్ సంస్థ ఇప్పటికే రెడీ చేసిన డిజైన్లు చూసేందుకు రాజమౌళి లండన్ వెళ్లారు. నార్మన్‌ పోస్టర్‌ సంస్థ రూపొందించిన భ‌వ‌న నమూనాల‌ు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించి, వాటికి తెలుగుదనం ఉట్టిపడే విధంగా మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. 
 
ఇందుకుగాను దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని ఆయనను పిలిపించి లండన్లో పర్యటించాలని తెలియజేసిన నేపధ్యంలో మంత్రి నారాయ‌ణ‌, ఎంపీ గల్లా జయదేవ్‌, రాజమౌళి, సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్ ప్రస్తుతం డిజైన్లును పరిశీలిస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 23 నుంచి లండన్‌లో పర్యటించనున్నారు. అక్కడే నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ రూపొందించిన‌ భ‌వ‌న న‌మూనాల‌ను ఫైనలైజ్ చేయనున్నారు. 
 
మరోవైపు భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించి నార్మ‌న్ ఫోస్ట‌ర్ ప్ర‌తినిధుల‌కు రాజ‌మౌళి సూచ‌న‌లు, సలహాలు ఇస్తున్నారు. ఆయన సూచనల మేరకు సిద్ధం చేసిన డిజైన్లను చంద్రబాబు నాయుడు ఫైనలైజ్ చేయనున్నారు.