శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 నవంబరు 2020 (16:02 IST)

రాశీ ఖన్నా అందాలు అదరహో.. (ఫోటోలు)

Rashi Khanna
హీరోయిన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుండటం ఫ్యాషనైపోయింది. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లకు హీరోయిన్లు దూరంగా వున్నారు. సినిమాలు లేకపోవడంతో ఫోటోషూట్స్‌తో యువత గుండెల్లో వలపు బాణాలు గుచ్చుతున్నారు. తాజాగా అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా తన చీర అందాలతో కూడిన ఫోటోలను షేర్ చేసింది. 
 
ఈ ఫోటోలు ప్రస్తుతం క్షణాలలోనే వైరల్‌గా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం లంగావోణీలో అందాలని ఆరోబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత చీరకట్టులో బాపుబొమ్మలా తయారైంది. ఇక తాజాగా పసుపు రంగు చీర ధరించి వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటో షూట్ చేసింది. 
 
ఈ ఫోటోలో రాశి ఖన్నాని చూసిన అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే ప్రతి రోజు పండగే చిత్రం తర్వాత మరో తెలుగు సినిమా దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం పలు తమిళ సినిమాలతోనే రాశి బిజీగా ఉందని తెలుస్తుంది.