ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 జులై 2022 (15:52 IST)

మాటే మంత్రముతో ప్రేక్షకుల ముందుకు రానున్న రాహుల్ విజయ్

Rahul Vijay
Rahul Vijay
"కుడి ఎడమైతే" వెబ్ సిరీస్‌లో అమలాపాల్‌తో పోటీ పడి నటించి ప్రేక్షకుల ప్రశంశలు పొందాడు హీరో రాహుల్ విజయ్. తాజాగా తను నటిస్తున్న సినిమాల జాబితా చూస్తుంటే చాలానే ఉన్నాయి అనిపిస్తుంది. కంటెంట్ ఉన్న కథలకు ప్రాధాన్యత నిస్తూ సరైన కథలు సెలెక్ట్ చేసుకుంటున్న రాహుల్ నిర్మాతల హీరో అనిపించుకొంటూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయాడు. తను తాజాగా తను నటించిన  పంచతంత్రం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.‘
 
 ఈ సినిమాను టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మించారు . ఇందులో శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే "తెల్లవారితే గురువారం" సినిమా చేసిన మణికాంత్ జెల్లి దర్శకత్వంలో ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాలో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తుంది .కళ్యాణ్ మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు.
 
ఇలా సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ... నటనలో మెరుగులు దిద్దుకుంటున్నాడు రాహుల్ విజయ్. ఇవే కాకుండా భిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ వరుసగా మరో రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. మొదటిది మేఘా ఆకాష్ తో కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై  ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్న చిత్రం “మాటే మంత్రము” ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. రెండవది GA2 బ్యానర్ లో తేజ మార్ని దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇందులో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ డిఫరెంట్ జానర్స్ ను సెలెక్ట్ చేసుకొని నటిస్తున్న రాహుల్ చాలా కూల్ గా ఉంటూనే ఎంతో సైలంట్ గా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో దూసుకుపోతూ నిర్మాతల హీరోగా మెప్పుపొందుతున్నాడు.