శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (19:06 IST)

రైతులకు సంఘీభావంగా రాజధాని ఫైల్స్ : చిత్ర యూనిట్

Akhilan - Veena - Vinod Kumar - Vani Vishwanath - Hima Bindu
Akhilan - Veena - Vinod Kumar - Vani Vishwanath - Hima Bindu
అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో, కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటివలే విడుదలైన ట్రైలర్ అద్భుతమై స్పందనతో సంచలనం  సృష్టించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ నిర్వహించారు.
 
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. రైతులు స్వచ్చందంగా ఇన్ని వేల ఎకరాల భూములు ఇస్తే దానిని హేళన చేస్తూ, వాళ్ళని క్షోభగురి చేసిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానిని స్ఫూర్తిగా తీసుకొని రైతుల పక్షాన ఒక సినిమా తీయాలని అనుకున్నాం. ఈ సినిమా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మాకు కనిపించిందల్లా రైతుల కళ్ళలో కన్నీళ్లు. ఆ కన్నీళ్లకు సమాధానంగా, కన్నీళ్లు తుడిచే విధంగా సమాజాన్ని చైతన్య పరుస్తూ ఒక సామాజిక బాధ్యత గా ఈ సినిమా చేశాం. భాను చాలా అద్భుతంగా తీశాడు.  వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ పాటు ఈ సినిమాలో పని చేసిన నటీనటులందరికీ ధన్యవాదాలు. మణిశర్మ చాలా అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే సినిమాకి అందరూ చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ప్రతి కుటుంబంలో ఎదో తరంలో ఒక రైతు ఉంటాడు. అందరూ ఒక బాధ్యతగా భావించి ఈ చిత్రాన్ని ఆదరించి రైతు కుటుంబాలని ఆదరించాలని కోరుతున్నాను. ఫిబ్రవరి 15న సినిమా విడుదలౌతుంది. చిత్రాన్ని అఖండ విజయం చేసి రైతులకు మన సంఘీభావాన్ని తెలియజేయాలి' అని కోరారు.
 
వినోద్ కుమార్ మాట్లాడుతూ... 'రాజధాని ఫైల్స్' పొలిటికల్ సినిమా కాదు.. రైతుల అవేదని తెలియజేసే కథ.  ఇందులో రైతు పాత్రని పోషించాను. ఇందులో అందరూ మంచి పాత్రలని పోషించారు. ఇందులో ప్రధాన పాత్రధారులు అమరావతి రైతులు.వారికి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. చాలా హార్డ్ వర్క్ చేశారు.  రవిశంకర్ గారు ఎక్కడా రాజీపడకుండా తీశారు. ఇది కంటెంట్ బేస్డ్ స్టొరీ. చాలా మంచి సినిమా అవుతుంది. మీ అందరీ సహకారం కావాలి'' అన్నారు.  
 
వాణీ విశ్వనాథ్ మాట్లాడుతూ... నా ద్రుష్టిలో ప్రపంచంలో గొప్ప వృత్తి వ్యవసాయం. 'రాజధాని ఫైల్స్' లో భాగం కావడం గొప్ప ఆనందంగా వుంది. దర్శక నిర్మాతలకు సినిమా చిత్ర బృందానికి ధన్యవాదాలు. తప్పకుండా సినిమా చూసి ఆదరించండి' అని కోరారు .    
 
దర్శకుడు భాను మాట్లాడుతూ.. రవిశంకర్ గారు చాలా అద్భుతంగా ప్రోత్సహించారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని చూపించే ఈ కథలో నటించడానికి ముందుకు వచ్చిన వినోద్ కుమార్ సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే వాణీ విశ్వనాథ్ గారు కొద ఎంతగానో ప్రోత్సహించారు. దాదాపు ఏడు వందల రైతుల మధ్య ఈ సినిమా తీశాం. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, మహిళలు ఈ చిత్రంలో నటించారు. ట్రైలర్ ఇంత సహజంగా కనిపించడానికి కారణం.. నిజంగా బాధని అనుభవించిన రైతులు, వారిలో అవేదన వుంది. అదే తెరపై అద్భుతంగా కనిపించింది. . అఖిలన్ చాలా అద్భుతంగా నటించారు. అమృత ఎరువాక పాటలో చక్కని అభినయం కనబరిచింది. అలాగే హీరోయిన్ వీణ పాత్ర కూడా చాలా బావుంటుంది. మాది జాతీయ జెండాలాంటి సినిమా. అందరికీ ఉపయోగపడే సినిమా ఇది. రవిశంకర్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని రూపొందించారు. మణిశర్మ గారు చాలా అద్భుతమైన సంగీతం అందించారు.  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ తో ప్రాణం పోశారు. అనిల్ చక్కని డైలాగులు రాశాడు.  సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇది పొలిటికల్ సినిమా కాదు. ఇది పబ్లిక్ ఫిల్మ్. రాజధాని రైతుల ఆవేదనని తెలియజేసే ప్రజల సినిమా ఇది. ప్రజల ప్రయోజనం కోసం తీసిన సినిమా ఇది. తప్పకుండా అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి' అని కోరారు.
 
అఖిలన్ మాట్లాడుతూ.. ఇది నా తొలి చిత్రం. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఫిబ్రవరి 15న సినిమా విడుదలౌతుంది. తప్పకుండ అందరూ థియేటర్స్ లో చూసి సినిమాని ప్రోత్సహించాలి'' అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.  
తారాగణం : అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, విశాల్ పట్నీ, షణ్ముఖ్, మధు, అజయరత్నం, అమృత చౌదరి, అంకిత ఠాకూర్