గురువారం, 20 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 15 జూన్ 2024 (19:36 IST)

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

Santhosh Kumar, Prasanna Kumar, Tummalapally, chandu ramesh
Santhosh Kumar, Prasanna Kumar, Tummalapally, chandu ramesh
"కేజీఎఫ్" రెండు సినిమాల తర్వాత పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు కన్నడ స్టార్ హీరో యష్. ఆయన తాజాగా "రాజధాని రౌడీ" సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి మరో సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రాన్ని సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మించారు. షీనా హీరోయిన్ గా నటించింది. కేవీ రాజు దర్శకత్వం వహించారు. "రాజధాని రౌడీ" సినిమా ఇటీవలే రిలీజై అన్ని కేంద్రాల నుంచి సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు టి. ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నైజాం డిస్ట్రిబ్యూటర్ సంజీవి, పీఆర్ఓ చందు రమేష్ పాల్గొన్నారు.
 
నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ - మా "రాజధాని రౌడీ" సినిమాకు అన్ని థియేటర్స్ నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. నైజాంలో 94 థియేటర్స్ లో రిలీజ్ చేశాం. హైదరాబాద్ తో పాటు బీ, సీ సెంటర్స్  లో కలెక్షన్స్ బాగున్నాయి. నేను ఈ సినిమా తీసుకున్నప్పుడే యష్ గారికి చెప్పాను బాగా రిలీజ్ చేస్తానని. ఒక సినిమా వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసి 50 కోట్లు ఆదాయం వస్తే ఆ సినిమా లాస్ కిందే లెక్క. కానీ మా "రాజధాని రౌడీ" సినిమా మేము పెట్టిన పెట్టుబడికి వచ్చే కలెక్షన్స్ తో చూస్తే హ్యాపీగా ఉన్నాం. సినిమా రిలీజ్ టైమ్ లో క్యూబ్, యూఎఫ్ఓ ల నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నిర్మాతలు టి. ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ గారు హెల్ప్ చేశారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ జర్నీలో పీఆర్ఓ చందు రమేష్ బాగా సపోర్ట్ చేశారు. "రాజధాని రౌడీ" సినిమాకు ప్రేక్షకుల ఆదరణ మరింత దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
నైజాం డిస్ట్రిబ్యూటర్ సంజీవి మాట్లాడుతూ- గత కొద్ది రోజులుగా బీ, సీ సెంటర్స్ లో సినిమాలు ఆదరణ పొందటం లేదు. "రాజధాని రౌడీ" సినిమా రిలీజ్ చేశాక బీ, సీ సెంటర్స్ లో మా మూవీ రిలీజ్ చేసిన థియేటర్స్ లో కలెక్షన్స్ బాగున్నాయి. ఎగ్జిబిటర్స్ ఫోన్ చేసి కలెక్షన్స్ బాగున్నాయని చెబుతుండటం హ్యాపీగా ఉంది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అన్నారు.
 
నిర్మాత టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - "రాజధాని రౌడీ" సినిమా సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. ప్రేక్షకాదరణ దక్కితే చిన్న నిర్మాతలు బాగుంటారు. సినిమా మీద పిచ్చి లేకుంటే ఎవరూ ఇండస్ట్రీలోకి రారు. నిర్మాత సంతోష్ కుమార్ కూడా అలాగే ఒక ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఉంటారు.  సినిమా అనేది ఒకప్పుడు చవకైన వినోదంగా ఉండేది. ఇప్పుడు దాన్ని టికెట్ రేట్లు పెంచి ఖరీదైన వినోదంగా మార్చారు. ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కు వస్తారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు సినిమా అవార్డులను ఇవ్వబోతున్నాయి. త్వరలోనే ఏపీలో నంది అవార్డ్స్, తెలంగాణలో సీఎం రేవంత్ గారు చెప్పినట్లు గద్దర్ అవార్డ్స్  ఇస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
 
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - చిన్న నిర్మాతకు ఏదైనా కష్టం వస్తే ప్రసన్నకుమార్ గారు హెల్ప్ చేసేందుకు ముందుంటారు. ఈ సినిమా విషయంలోనూ ఆయన మాట సాయం చేశారు. నిర్మాత సంతోష్ నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఈ సినిమాను ఒక ప్యాషన్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నైజాం ఏరియాలో 94 థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ వారం రిలీజైన సినిమాల్లో  "రాజధాని రౌడీ" సినిమానే బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ రిలీజై 2 రోజులవుతోంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇకపైనా ఇలాగే ప్రేక్షకుల ఆదరణ కొనసాగాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
పీఆర్ఓ చందు రమేష్ మాట్లాడుతూ - "రాజధాని రౌడీ" సినిమా విజయం సాధించడం హ్యాపీగా ఉంది. నిర్మాత సంతోష్ నాకు మంచి మిత్రుడు. ఎన్నో ఏళ్లుగా తెలుసు. ఆయన ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో రిలీజ్ చేశారు. ఆయన నమ్మకం నిజమైంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొని సపోర్ట్ అందిస్తున్న రామసత్యనారాయణ, ప్రసన్న గారికి థ్యాంక్స్. అన్నారు.