గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జులై 2021 (23:21 IST)

సంపూర్ణమైన ఆరోగ్యంతో రజనీకాంత్: “#AnnaattheDeepavaliకి రెడీ!

Annaatthe
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఇటీవలే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా వెళ్ళినప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే, తాజాగా రజనీ అమెరికాలోని తన స్నేహితులలో కలిసి ఖుషిఖుషీగా మాట్లాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
రజనీ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రజనీ అమెరికాలోని అత్యుత్తమైన మాయో క్లినిక్‌లో ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన వెంట ఆయన భార్య లత, పెద్ద కుమార్తె ఐశ్వర్య ఉన్నారు.
 
అలాగే రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వం వహిస్తున్న 'అణ్ణాత్త' సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీపావళి కానుకగా నవంబర్‌ 4న సినిమాను విడుదల చేస్తున్నట్లు గురువారం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనా, కుష్భూ, నయనతార, కీర్తి సురేశ్‌, జగపతిబాబు, జాకీష్రాఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమాన్‌ సంగీతం స్వరకర్త. కళానిధి మారన్‌ నిర్మాత.