గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (08:08 IST)

రజనీకాంత్‌కు అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిట్

rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం రాత్రి తీవ్రమైన కడుపు నొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. చెన్నై గ్రీమ్స్ రోడ్డులో ఉన్న అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం రజనీకాంత్‌‌కు వైద్యులు చికిత్స అందించారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. 
 
మరోవైపు, సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో ముందుగానే సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. మంగళవారం రజనీకి డా.సతీష్ ఆదర్వంలో ఎలక్టివ్ ప్రొసీజర్ షెడ్యూల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రజనీ వయసు 73 సంవత్సరాలు. కొన్నిరోజులుగా 'కూలీ' చిత్రం షూటింగ్స్‏లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. 
 
మరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన సతీమణి లత స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అలాగే, ఆస్పత్రి వైద్యులు కూడా మంగళవారం హెల్త్ బులిటెన్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 'వేట్టయన్‌', 'కూలీ' చిత్రాల్లో రజనీ నటిస్తున్నారు. 'వేట్టయన్‌' ఈ నెల పదో తేదీన విడుదలకానుంది.