రకుల్‌ను వెనుకకు నెట్టి, ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్

Rakul Preet Singh
ప్రీతి| Last Updated: బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:31 IST)
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టి చాలా రోజులైనా ఇంకా సక్సెస్‌ఫుల్ హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ లేకపోవడంతో ఈసారి తమిళ్ రీమేక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. తమిళంలో విష్ణు విశాల్ హీరోగా విడుదలై, మంచి హిట్ సాధించిన థ్రిల్లర్ సినిమా "రాచ్చసన్" సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని భావించారు. కానీ ఈ హీరోహీరోయిన్ కాంబినేషన్‌లో ఇప్పటికే "జయ జానకి నాయక" సినిమా వచ్చింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారట. ఇప్పుడు రాశీఖన్నా పేరు పరిశీలిస్తున్నారు. వీరి కాంబినేషన్ అయితే ఫ్రెష్‌గా ఉంటుందని, పైగా రకుల్ ఈ సినిమాకు చాలా ఎక్కువ డిమాండ్ చేసిందనీ సినీ వర్గాల టాక్. తమిళ చిత్రంలో హీరోయిన్‌గా అమలా పాల్ చేసిన ఈ పాత్రకు రాశీ ఖన్నా సరిపోతుందని భావిస్తున్నారంట. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి.దీనిపై మరింత చదవండి :