ట్రంప్‌పై వర్మ కామెంట్స్.. ఆయనకంటే పెద్ద దేశద్రోహి అమెరికాలో లేడు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పడ్డాడు. ట్రంప్‌పై సెటైర్లు విసురుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. డొనాల్డ్ ట్రంప్ కంటే పెద్ద దేశద్రోహి అమెరికాలో లేడని విమర్శించారు. కరోనా క్లిష్ట సమయంలో అధ్యక్షుడిగా సమర్థవంతమైన పాలన అందించాల్సిందిపోయి అమెరికా లోపాలను, చెడు విషయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని ట్విట్టర్‌లో వర్మ పేర్కొన్నారు.
ఇన్నాళ్లూ ప్రపంచ జనమంతా అమెరికా ఏయే విషయాల్లో ఉత్తమంగా ఉందోనని అనుకుంటున్నారో... అవన్నీ ఉత్తివే అని స్వయంగా అధ్యక్షుడే చెప్తున్నారని వర్మ చురకలంటించారు. దాంతోపాటు కరోనా పోరులో తెగ పనిచేస్తున్నానని పేర్కొన్న ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ''డొనాల్డ్ ట్రంప్ యుద్ధ కాలపు అధ్యక్షుడు" అని పేర్కొన్నాడు.
అదేవిధంగా.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ ఫొటోతో ఉన్న ఓ మీమ్‌ను కూడా వర్మ షేర్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.