సీఎం కేసీఆర్‌కు విస్కీ ఛాలెంజ్ విసిరిన దర్శకుడు ఎవరు?
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమతమ గృహాలకే పరిమితమయ్యారు. ఇలాంటి వారిలో పలువురు సెలెబ్రిటీలు తమ ఇళ్లలో పను చేస్తూ, అలాంటి పనులనే చేయాలంటూ మరికొంతమంది సెలెబ్రిటీలను నామినేట్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు సందీప్ వంగా బీ ద రియల్ మ్యాన్ పేరుతో విసిరిన ఓ ఛాలెంజ్ ఇపుడు టాలీవుడ్‌లో వైరల్ అయింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తమ టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేశారు.
ముఖ్యంగా రాజమౌళి తన పనులను పూర్తి చేసి, జూనియర్ ఎన్టీఆర్, చెర్రీల పేర్లను నామినేట్ చేశారు. ఇపుడు ఈ ఇద్దరు హీరోలు మరికొందమంది పేర్లను నామినేట్ చేశారు. ఈ క్రమంలో తెలుగులో వివాదాస్పద దర్శకుడుగా పేరొందిన రాంగోపాల్ వర్మ ఇపుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విస్కీ ఛాలెంజ్ విసిరారు.
ఇప్పుడు అందరూ మందు దొరక్క ఇబ్బందిపడుతున్నారని, ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీవీలో అందరికీ కనిపించేలా గ్లాస్ విస్కీ తాగి అందరికీ షాక్ ఇవ్వాలనేదే తన ఛాలెంజ్ అని ఆర్జీవీ తెలిపారు.
అయితే, ఆర్జీవీ ఈ తరహా ఛాలెంజ్ విసరడానికి గల కారణాన్ని కూడా వివరించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ అయివున్నాయి. ఇపుడు విస్కీ ఛాలెంజ్ విసరడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీవీలో అందరికీ కనిపించేలా గ్లాస్ విస్కీ తాగి అందరికీ షాక్ ఇవ్వాలనేదే తన ఛాలెంజ్ అని ఆర్జీవీ తెలిపారు.