ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:40 IST)

నా కూతురు నన్ను జూలో జంతువులా చూస్తోందంటున్న వర్మ

రాంగోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వివాదాలకు కేరాఫ్ ఆయన. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. వర్మకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడమే ఇలా చేస్తున్నారని చాలామంది ఇప్పటికీ తెలియదు. వర్మ భార్య, కుమార్తె ఇద్దరూ వర్మను వదిలి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.
 
దర్సకుడిగా కాకముందు తను రత్న అనే అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళి చేసుకున్నాను. శివ చిత్రీకరణ సమయంలో నాకొక కూతురు పుట్టింది. పెళ్ళయి కూతురు పుట్టిన తరువాత నా భార్య నేను సెల్ఫీష్ అనుకుని నిర్ణయానికి వచ్చేసింది. నిర్థాక్షణ్యంగా వదిలి వెళ్ళిపోయింది. 
 
ఇక నా కూతురు గురించి చెప్పాలంటారా.. అమెరికాలో తను ప్రస్తుతం ఉంది. తండ్రినైన నన్ను జూలో ఒక జంతువులా నన్ను భావిస్తుందట. నాతో మాట్లాడటానికి కూడా ఆమె ఇష్టపడదు. నేను సెల్ఫిష్ అంటూ ఎప్పుడూ వాళ్ళ అమ్మకు చెబుతూ ఉంటుంది. అందుకే నేను సెల్ఫ్ సెంటర్డ్ అని ఎప్పుడూ మనస్సులో అనుకుంటూ ఉంటానని చెబుతున్నాడు వర్మ.