ఆయన అలా అటగదా.. ఇలా అటగదా... అని అడిగారు.. కలర్ స్వాతి

color swathi
ఠాగూర్| Last Updated: మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (13:46 IST)
మొదటి నుంచి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చిన స్వాతి, కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటూ వస్తోంది. వర్మ దర్శకత్వంలో 'కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు' సినిమాలోను ఆమె నటించింది.

అయితే, కలర్స్ స్వాతి స్పందిస్తూ, 'వర్మ దర్శకత్వంలో నేను ఈ సినిమా చేసిన తర్వాత, ఆయన గురించి అంతా నన్ను అడగడం మొదలుపెట్టారు. ఆయన అలా అటగదా .. ఇలా అటగదా అంటూ మొహమాటం లేకుండా అడిగేవారు. కానీ వర్మ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.

అవసరానికి మించి నాతో ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 'స్వాతి నువ్ చాలా టాలెంటెడ్ .. నిన్ను చూస్తుంటే నాకు రేవతి గుర్తొస్తుంది. కాకపోతే మీ ఇద్దరూ కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు.. అలా కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లిపో' అనేవారని వర్మ గురించి కలర్స్ స్వాతి చెప్పుకొచ్చింది.దీనిపై మరింత చదవండి :