ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (22:05 IST)

ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర లీక్...?

రాజమౌళి ప్రస్తుతం తీస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు రోజుకొకటి బయటికి వస్తున్నాయి. రాజమౌళి ప్రస్తుతం ఎన్‌టీఆర్‌కు విశ్రాంతి ఇచ్చి రామ్‌చరణ్‌కు సంబంధించిన సీన్లను తీసేపనిలో నిమగ్నమైనట్లు సమాచారం.
 
తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించిన కొన్న విషయాలు తెలిసాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ నుండి బ్రిటిష్ కాలంనాటి పోలీస్టేషన్ సెట్ లీక్ అయింది. అందులో పోలీస్‌స్టేషన్ బయట బ్రిటిష్ జెండా కూడా కనిపించింది. దీనితో రామ్ చరణ్ బ్రిటిష్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసిపోయింది. ఇందులో రామ్ చరణ్ పాత్రను అల్లూరి సీతారామరాజు లక్షణాలు ఉండేలా ప్లాన్ చేసినట్లు, అతని పాత్ర పేరు కూడా రామరాజు అని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
 
మరోవైపు ఎన్‌టీఆర్ బంధిపోటు పాత్రలో నటిస్తున్నాడు. అయితే వీరిద్దరూ ఎలా కలిసారు, చివరకు ఏమైంది అనే అంశం ఆధారంగానే సినిమా ఉండబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం.