వ్యూహానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇదిగో అంటున్న రామ్‌గోపాల్ వర్మ
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వై.యస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం వ్యూహం. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో వ్యూహం సినిమా గురించి ఆత్రంగా ఎదురుచూశారు. మొత్తానికి రీ– సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదలవుతున్నట్లుగా దర్శకుడు ఆర్జీవి తన ట్వీట్టర్ ఎకౌంట్ ద్వారా తెలిపారు.
చెడ్డ కుర్రాళ్లకు బ్యాడ్ న్యూస్ అంటూ తనదైన స్టైల్లో ట్వీట్ చేస్తూ సెన్సార్ సర్టిఫికెట్తో తన ఫోటోను జత చేశారు ఆర్జీవి. ఈ ఫోటోలో సినిమా రెండుగంటల ఆరు నిమిషాలు నిడివి ఉన్న వ్యూహం సినిమాకు యూ సర్టిఫికెట్‌ను కేటాయించింది సెన్సార్‌బోర్డు. రామధూత క్రియేషన్స్ పతాకంపై ఈ దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.