శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (15:15 IST)

ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబుగా రానా... అక్కినేని పాత్రలో అఖిలా? సుమంతా?

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఎన్టీఆర్ సతీమణిగా

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు.


నవరస నటనా సార్వభౌమ సత్యనారాయణ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి పాత్రలో కనిపించనుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనువిందు చేయనుంది. పక్కా ప్లానింగ్‌తో దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 
 
ఇప్పటికే బాలకృష్ణ .. విద్యాబాలన్‌పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించిన ఆయన, తదుపరి షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో రానా కూడా పాల్గొనే అవకాశం ఉందని టాక్. ఇక ఈ చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అల్లుడు పాత్రలో రానా కనిపిస్తాడు.

ఈ నేపథ్యంలో  కొన్నిరోజులుగా రానా చంద్రబాబు నాయుడి బాడీ లాంగ్వేజ్‌ను .. డైలాగ్ డెలివరీని ప్రాక్టీస్ చేస్తూ వున్నాడట. ఈ పాత్రకి సంబంధించి ఆయన రిహార్సల్స్ పూర్తయ్యాయని టాక్ వస్తోంది. 
 
తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్-చంద్రబాబు నాయుడికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అక్కినేని పాత్రకుగాను సుమంత్‌ను తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా అఖిల్ కూడా అక్కినేని పాత్ర రేసులో వున్నట్లు సమాచారం.