శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (14:06 IST)

దేశ ప్రజల్లో సగం మంది విషాన్ని తాగుతున్నారట...

దేశ ప్రజల్లో సగం మంది విషపూరిత నీటిని తాగుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, పురుగు మందుల కారణంగా దేశంలోని భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమయ్యాయని, ఈ నీటినే ప్రజలు తాగుతున్

దేశ ప్రజల్లో సగం మంది విషపూరిత నీటిని తాగుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, పురుగు మందుల కారణంగా దేశంలోని భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమయ్యాయని, ఈ నీటినే ప్రజలు తాగుతున్నట్టు పార్లమెంటుకు కేంద్రం తెలిపింది. దేశంలోని సగం జిల్లాల్లో నీటిలో నైట్రేట్స్, లెడ్, ఆర్సెనిక్, ఫ్లోరైడ్, కాడ్మియం, ఇతర భార లోహాలు మిళితమై ఉన్నట్టు పేర్కొంది.
 
పార్లమెంట్‌లో కేంద్రం తాజాగా సమర్పించిన నివేదికలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, ప్రస్తుతం దేశంలో 718 జిల్లాలు ఉండగా, ఇందులో 386 జిల్లాల్లోని భూగర్భ జలాలపై పరిశోధన చేశారు. వీటిలో హానికారక రసాయనాలు సాధారణం కంటే 50 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఇక ఢిల్లీలోని 11 జిల్లాల్లో ఏడింటిలో ఫ్లోరైడ్ కాలుష్యం తీవ్రంగా ఉందని, దేశంలోని 335 జిల్లాల్లో ఫోర్లైడ్, 153 జిల్లాల్లో ఆర్సెనిక్, 24 జిల్లాల్లో కాడ్మియం వంటి రసాయనాలున్నట్టు పేర్కొంది. ఈ నీటినే ప్రజలు తాగి అనారోగ్యం పాలవుతున్నారని తెలిపింది. 
 
ఈ విషపూరితమైన నీటిని వాడితే చర్మ, కాలేయ కేన్సర్‌తో పాటు బీపీ, నపుంసకత్వం, కిడ్నీలు ఫెయిల్ కావడం, రక్తంలో ఆక్సీజన్ శాతం తగ్గిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.