శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జులై 2018 (18:30 IST)

ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపేసిన డాక్టర్.. డబ్బులిస్తే రాయిని తొలగిస్తానని?

వైద్య వృత్తికే ఆ వైద్యుడు కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే రోగి జీవితంతో ఆడుకున్నాడు. డబ్బులిస్తే కానీ కిడ్నీలోని రాళ్లు తొలగించనని మొండికేశాడు. అంతేగాకుండా ఆపరేషన్‌ను మధ్యల

వైద్య వృత్తికే ఆ వైద్యుడు కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే రోగి జీవితంతో ఆడుకున్నాడు. డబ్బులిస్తే కానీ కిడ్నీలోని రాళ్లు తొలగించనని మొండికేశాడు. అంతేగాకుండా ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో చోటుచేసుకుంది.


ఆపరేషన్ మధ్యలో వదలేసిన డాక్టర్‌ను రోగి బంధువులు నిలదీసే ప్రయత్నం చేయడంతో అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. దీంతో ఆస్పత్రి సిబ్బందికి, రోగి బంధువులకు మధ్య వాగ్వివాదం జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. పెదతాడేపల్లి వీకర్స్ కాలనీకి చెందిన పార్థసారథి కిడ్నీ వ్యాధితో మదర్ వన్నిని ఆసుపత్రిలో చేరాడు. కిడ్నీలో రాళ్ళు తొలగించేందుకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. తీరా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లగానే శస్త్రచికిత్స చేస్తున్న డాక్టర్‌కు ఏమైందో ఏమో కానీ.. ఆపరేషన్‌ను ఆపేశాడు. 
 
సగం ఆపరేషన్ అయ్యాక కిడ్నీ‌లో స్టోన్ బాగా కిందకు ఉందని ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో కుదరదని డాక్టర్ మహేష్ తెలిపాడు. తనకు డబ్బులిస్తే రాయి తొలగిస్తానని మొండికేశాడు. సొమ్ములిచ్చుకోలేమని పార్థసారధి బంధువులు చెప్పడంతో డాక్టర్ మహేష్ ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.