బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (14:09 IST)

రణబీర్-అలియా పెళ్లి చేసుకుంటారు.. చెప్పింది ఎవరో తెలుసా?

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది.  నాలుగేళ్లుగా అలియా-రణబీర్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ జంట తమ బంధాన్ని దాచిపెట్టే ప్రయాణం చేయలేదు. వీరిద్దరూ కలిసి నటించిన 'బ్రహ్మాస్త' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. 
 
అయితే తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఈ జంట పెళ్లిపై రియాక్ట్ అయింది. ఈ ఏడాదిలోనే రణబీర్-అలియా పెళ్లి చేసుకుంటారని చెబుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. లారా దత్తా. తను పాత తరానికి చెందిన నటిని అని.. ఇప్పటి జెనరేషన్ హీరో-హీరోయిన్లలో ఎవరు డేటింగ్‌లో ఉన్నారో.. ఎవరు విడిపోయారో తనకు తెలియదని చెప్పింది. 
 
కానీ రణబీర్-అలియా భట్ ల గురించి మాత్రం తెలుసునని చెప్పుకొచ్చింది. వాళ్లిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని చాలా నమ్మకంగా చెబుతోంది. తనకు తెలిసినంత వరకు వాళ్లిద్దరూ ఈ ఏడాదిలోనే పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారని బయటపెట్టింది.