గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (11:36 IST)

ఆగలేకపోతున్నా... రిలీజ్ చేయండి ప్లీజ్ అంటున్న హీరో

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రం పాటలు ఇంకా విడుదల కాలేదు. కానీ, టాలీవుడ

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రం పాటలు ఇంకా విడుదల కాలేదు. కానీ, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ వినేశాడు. ఆ తర్వాత ఓ ట్వీట్ చేశాడు. 
 
"నా సోదరుడు రాంచరణ్ నాకు 'రంగస్థలం' పాటలు వినిపించాడు. అప్పటి నుంచి ఆ పాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆడియో.. సినిమా కోసం ఆగలేకపోతున్నా. త్వరగా రిలీజ్ చేయండి" అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. ఇక అంతే.. మెగా అభిమానుల నుంచి మనోజ్‌కు సందేశాలు వెల్లువెత్తాయి. పాటల గురించి వివరాలు అడుగుతూ ట్వీట్లు గుప్పించేశారు. ఓ అభిమాని రాంచరణ్ గురించి ఒక్క మాటలో చెప్పమని మనోజ్‌ను అడిగితే.. 'బంగారం' అని బదులిచ్చాడు మంచు వారబ్బాయి.
 
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం'కు అతడి ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సుక్కు - దేవి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. 'రంగస్థలం' 80ల నాటి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న విభిన్నమైన సినిమా కావడంతో దీని ఆడియో కూడా ప్రత్యేకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది రిలీజ్ చేయనున్నారు.