శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (10:06 IST)

నన్ను బాగానే చూసుకుంటున్నారు.. అలాగని వేధింపులు లేవని చెప్పను : రాశిఖన్నా

తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ఉత్తరాది భామల్లో రాశిఖన్నా ఒకరు. "ఊహలు గుసగుసలాడె" అనే చిత్రంతో ఆమె తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత అనేక మంది స్టార్ హీరోల సరసన నటించింది. నిజానికి ఆమె నటిస్తున్న అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నా.. రాశిఖన్నాకు మాత్రం సినీ అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. 
 
దీనికి కారణం ఆమె వ్యక్తిత్వంతోపాటు సినీ పెద్దల పట్ల ఆమెకు ఉండే గౌరవమర్యాదలేనని అంటున్నారు. అయితే, ఇటీవలి కాలంలో తెలుగు ఇండస్ట్రీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై తీవ్రస్థాయిలో చర్చకూడా జరిగింది. ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నవారిలో అనేక మంది మీడియా ముందుకు వచ్చారు. 
 
ఈ వేధింపులపై రాశిఖన్నా స్పందిస్తూ, వేధింపులకు గురౌతున్నవారు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పడం చాలా గొప్ప విషయం. వారు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను బయటకు వచ్చి నిర్భయంగా చెప్పగలగడం మామూలు విషయం కాదు. వాళ్ల ధైర్యాన్ని నిజంగా అభినందించాలని అన్నారు. 
 
ఇకపోతే, 'మీటూ' ఉద్యమంపై చెప్పేందుకు ప్రత్యేకంగా తనవద్ద ఏమీ లేదన్నారు. అదేసమయంలో తన తొలి సినిమా వరకు ఇప్పటివరకు తాను ఎలాంటి లైంగిక వేధింపులకు గురికాలేదన్నారు. ప్రతి ఒక్కరూ బాగానే చూసుకుంటున్నారని చెప్పారు. అలాగనీ, ఇండస్ట్రీలో వేధింపులు లేవని తాను సర్టిఫికేట్ ఇవ్వడం లేదని రాశిఖన్నా అభిప్రాయపడ్డారు.