గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (18:51 IST)

తిరుమలలో అన్న‌దానం చేసిన రాశీఖ‌న్నా

Rashikhanna- Annadan Prasadam
Rashikhanna- Annadan Prasadam
స‌హజంగా త‌మ సినిమా విడుద‌ల‌కుముందు తిరుమ‌ల వెళ్ళి శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డం చాలా మందికి ఆన‌వాయితీ. హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఇలా వెళుతూ అక్క‌డివారిని సందడి చేస్తుంటారు. కొంద‌రైతే ఏకంగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మాఢ‌వీధుల్లో చెప్పుల‌తో తిరుగుతూ విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతారు. కానీ న‌టి రాశీఖ‌న్నా మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా తిరుమ‌ల‌లో అన్న‌దానం చేసింది. 
 
ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంలో న‌టించిన రాశీఖ‌న్నా చిత్ర బృందంతోపాటు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. త‌ర్వాత అన్న‌దానికి సంబంధించిన కొంత మొత్తాన్ని డొనేష‌న్ చేశారు. ఆ వివ‌రాలు చెప్ప‌కూడ‌ద‌ని ఆమె నిర్ణ‌యించుకుంది. తాను మ‌న‌స్పూర్తిగా సేవ‌చేయాల‌నుంద‌ని వ్య‌క్తం చేసింది. వెంట‌నే అధికారులు ఆమెను తిరుమ‌ల‌లోని అన్న‌దాన‌ప్ర‌సాదం మందిరానికి తీసుకు వెళ్ళారు. అక్క‌డ ఆమె  భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఇలా చేయ‌డం త‌న‌కెంతో ఆనందాన్ని ఇచ్చింద‌నీ, అంద‌రికీ శ్రీ‌వారి ర‌క్ష వుండాల‌ని ఆకాంక్షించారు. రాశీఖ‌న్నా చేసిన ప్ర‌క్రియ‌కు అక్క‌డి ఉద్యోగులు ఎంత‌గానో ఆమెను అభినందించారు.