1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (12:49 IST)

స్పెయిన్‌లోని ప్లాజా డి ఎస్పానాలో రవితేజ ధమాకా రొమాంటిక్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌

Damaka team in spain
రవితేజ,  త్రినాధరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉన్న నటి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
 
ఇటీవల హైదరాబాద్‌లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. కాగా, రవితేజ, శ్రీలీలపై ఓ పాట చిత్రీకరణ కోసం టీమ్ స్పెయిన్ వెళ్లింది. ప్రస్తుతం ప్లాజా డి ఎస్పానా అనే హిస్టారికల్ లొకేషన్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
 
ప్లాజా డి ఎస్పానా స్పెయిన్‌లోని సెవిల్లెలోని పార్క్ డి మారియా లూయిసాలో ఉన్న ప్లాజా. ఇది ప్రాంతీయ వాస్తుశిల్పంతో రూపొందిన ప్రపంచంలోనే ప్రత్యేకమైన ప్లాజా-ప్యాలెస్. రొమాంటిక్ పాటను చిత్రీకరించడానికి ఇది ఖచ్చితంగా అద్భుతమైన ప్రదేశంగా నెల‌కొంది.
 
‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ధమాకా వస్తుంది. ఇందులో ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నిక‌ల్‌గా అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు.
 
ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.