బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (12:50 IST)

రవితేజ 'రావణాసుర' టీజర్ రిలీజ్ - ఏప్రిల్‌లో బొమ్మ విడుదల

ravanasura teaser
సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ నటించిన కొత్త చిత్రం "రావణాసుర". వచ్చే నెలలో థియేటర్లలో విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. అభిషేక్ నామా, రవితేజ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్థన్, భీమ్స్ కలిసి సంగీతం అందించారు. ఈ చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్‌కు ఈ టీజర్ అదిరిపోయేలా చేసింది. రవితేజ రావణాసుర గెటప్‌లో కనిపించనున్నాడు. తాను టార్గెట్ చేసిన వాళ్లను వరుసగా చంపడమే హీరోగా క్రమంలో రవితేజను రావణాసురుడిగా చూపించారు.
 
అయితే, వరుస హత్యలు చేస్తున్న హీరోను పట్టుకునేందుకు జయరామ్, మురళీశర్మలు పోలీస్ ఆఫీసర్లుగా చూపించారు. అయితే, హీరో ఎందుకు అంత రాక్షసంగా మారాడన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురిడిని దాటి వెళ్లాలి అనే డైలాగ్ హెలెట్‌గా నిలిచింది. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్ష, పూజిత పొన్నాడలు హీరోయిన్లుగా నటించారు. రావు రమేశ్, సుశాంతి కీలక పాత్రలను పోషించారు. ఏప్రిల్ 7వ తేదీన చిత్రం విడుదల కానుంది.