శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (09:48 IST)

కృష్ణవంశీ నక్షత్రంలో రెజీనా పోలీస్: సోషల్ మీడియాలో ఫోటోలు!

గోవిందుడు అందరివాడేలే సినిమాకు తర్వాత కృష్ణ వంశీ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. నక్షత్రం అనే పేరిట ఈ సినిమా తెరకెక్కుకోంది. ఈ సినిమాలో రెజీనా గెటపే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఖాకీ డ్రెస

గోవిందుడు అందరివాడేలే సినిమాకు తర్వాత కృష్ణ వంశీ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. నక్షత్రం అనే పేరిట ఈ సినిమా తెరకెక్కుకోంది. ఈ సినిమాలో రెజీనా గెటపే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

ఖాకీ డ్రెస్‌లో రెజీనా స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇలాంటి పాత్రల కోసమే ఫిజిక్ కాపాడుతున్నానని చెప్పిన రెజీనా.. ప్రస్తుతం పోలీస్ డ్రెస్‌లో ఆకట్టుకుంటోంది. కెరీర్ మొదట్లో మంచి గ్లామర్ పాత్రలతో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రలపై ఆసక్తి చూపుతోంది. 
 
ప్రస్తుతం రెజీనాకు పోలీస్ పాత్ర క్లిక్ అయితే ఇక ఆమెకు తిరుగుండదని.. ఫిలిమ్ నగర్‌లో టాప్ హీరోయిన్ అయిపోతుందని జోస్యం చెప్తున్నారు. ఓ పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్న హీరో ఎలా తన కలను నిజం చేసుకున్నాడు అనే కథాంశంతో నక్షత్రం సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నక్షత్రంలో పోలీస్ గెటప్‌లో అమ్మడు నటించట్లేదని కూడా వార్తలొస్తున్నాయి. దీనిపై రెజీనా స్పందించాల్సి ఉంది.