శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

గోపీచంద్ సీటీమార్ రిలీజ్ వాయిదా

గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం సీటీమార్. ఈ చిత్రం మరోమారువాయిదాపడింది. సంపత్‌నంది దర్శకత్వంలో స్పోర్ట్స్‌ డ్రామాగా ‘సీటీమార్‌’ తెరకెక్కింది. తమన్నా కథానాయికగా సందడి చేయనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. 
 
ఇటీవల రానా నటించిన ‘అరణ్య’ చిత్రం హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ మార్చి 26న విడుదల కావల్సి ఉండగా.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సినిమా విడుదల చేయలేదు. తాజాగా సీటీమార్‌ సైతం వాయిదా పడింది. 
 
అయితే.. నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తికాకపోవడంతోనే సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. 
 
ఈ సినిమాలో గోపీచంద్‌, తమన్నా ఇద్దరూ కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ ప్రేక్షకులను అలరిస్తోంది.