మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (17:12 IST)

క‌ష్ట‌ప‌డితేనే విజ‌యం వ‌రిస్తుంద‌ని చిరంజీవి అన్నారుః పవన్‌ తేజ్‌

''ఈ కథలో పాత్రలు కల్పితం'' ప్రీ రిలీజ్ వేడుక‌

EE kathalo patralu kalpitam prerelease
పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా న‌టించిన సినిమా `ఈ కథలో పాత్రలు కల్పితం`. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మించారు. ఈనెల 26న విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్యక్రమానికి గీత‌ర‌చ‌యిత చంద్రబోస్, అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం,  సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు.
 
గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ, వేరే వాళ్ళు పాటలు రాసిన సినిమాకి నేను ముఖ్య అతిధిగా రావడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఈ సినిమా టైటిల్ చాల బాగుంది. రాహుల్ , నోయెల్ లు మంచి మిత్రులు. ఈ ఇద్దరు పైకి రావాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రంలోని పాటలు అందరికి నచ్చాలి. ప్రజాదరణ పొందాలి. మంచి ఛాన్స్ లు కార్తీక్ గారికి రావాలని కోరుకుంటున్నాను.  దర్శకుడుకి మంచి సక్సెస్ రావాలి. ఈ చిత్రంలో నటించిన అందరికి, సాంకేతిక నిపుణులు అందరికి ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ సినిమా ద్వారా హీరోగా వస్తున్నాను. చిరంజీవి గారు ఎంతో కష్టపడాలి అప్పుడే విజయం వరిస్తుంది అన్నారు. అది చేయడానికి ఎంతో కష్టపడతాను. నన్ను నమ్మి ఇంత మనీ ఇన్వెస్ట్ చేసిన నిర్మాతకి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకోసం ఇంత మంచి స్టోరీ రాసిన డైరెక్టర్ అభిరామ్ను మర్చిపోలేను. మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. అందరు ఈ సినిమా ను ఆశీర్వదించి హిట్ చేయండి అన్నారు.
 
సంగీత దర్శకుడు కార్తీక్‌ కొడకండ్ల మాట్లాడుతూ, చంద్రబోస్ గారితో కలిసి పనిచేయడం ఎంతో గొప్పగా ఉంది. పాటలు అందరికి నచ్చాయని అనుకుంటున్నాను. ఈ పాటలు ఇంత బాగా రావటానికి కారణం విజువల్స్ ఎంతో అద్భుతంగా తీయ‌డ‌మే` అన్నారు. 
 
సింగర్ నోయెల్ మాట్లాడుతూ,  ద‌ర్శ‌క నిర్మాత‌లిద్ద‌రూ అభిరుచితో సినిమా చేశారు. హీరో పవన్ తేజ్ కొణిదెల అంకిత‌భావం చాలా బాగుంది. హీరోయిన్ ఎంతో ఫ్యాషన్ తో ఇంతదూరం వచ్చింది. ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అభిరామ్ ప్ర‌తిభ ఉన్న డైరెక్టర్.  అందరూ ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేయాలి అని కోరుకుంటున్నాన‌న్నారు.
 
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ..  చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి. మాలాంటి వాళ్ళను ప్రోత్సహించండి. మాకు ఇది ఎంకరేజ్ లాగా ఉంటుంది. పాటలు బాగున్నాయి. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాల‌ని అన్నారు.
 
నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ, నేను సినిమా నేపథ్యం కలిగిన వాడిని కాదు. కానీ పవన్ తేజ్ కొణిదెల ఓ డైరెక్టర్ ని తీసుకొచ్చి చెప్పిన కథ ఎంతో ఆకట్టుకుంది. లాక్ డౌన్ లో కష్ట సమయంలో అందరు నన్ను సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బోరబండ సత్యమన్న కి, అంబర్ పేట్ శంకరన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 
దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ, మెగా ఫ్యామిలీలో ఓ హీరో మంచి సబ్జెక్టు కోసం చూస్తున్నారని విని కథ చెప్పాను. ఆయనకు కథ విపరీతంగా నచ్చేసింది. వెంటనే ప్రొడ్యూసర్ ని కలిస్తే సినిమా ఓకే అయ్యింది. అయన ఇప్పటికీ స్క్రిప్ట్ కూడా వినలేదు. నన్ను నమ్మిన ఆయనకు కృతజ్ఞతలు. ఈ సినిమా టైటిల్ కూడా అయన ఇచ్చిందే. మాటలరచయిత సయ్యద్ మాట‌లు, కెమెరాప‌నిత‌నం, మల్లేష్ గారి ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారితో వర్క్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది` అన్నారు. మేఘ‌న‌తోపాటు మిగిలిన‌వారంతా చిత్ర విజ‌యం కావాల‌ని ఆకాంక్షించారు.