మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (19:20 IST)

ఉగాదికి ఆది సాయి కుమార్ కొత్త సినిమా

Adi sai kumar, yugandhar
`శ‌శి` సినిమాతో మాస్ పాత్ర‌నుకూడా పోషించ‌గ‌ల‌డ‌నే పేరు తెచ్చుకున్న ల‌వ్‌లీ స్టార్ ఆది సాయికుమార్ త‌న తాజా సినిమాను ప్ర‌క‌టించారు. భాస్కర్ బంటు పల్లి ఈ సినిమా కి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్ తో , సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు.. శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా గుడివాడ యుగంధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాకేత్ కొమండూరి సంగీతం సమకూరుస్తుండగా A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 13 న సినిమా ప్రారంభోత్సవం చేయనున్నారు.